చెన్నైలో జరిగిన HCL గ్రూప్ 50వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా, CEO సి విజయకుమార్ ప్రసంగిస్తున్న సమయంలో ఉద్యోగులు జీతం పెంపు కోసం నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

చెన్నైలో జరిగిన HCL గ్రూప్ 50వ వార్షికోత్సవ వేడుకల నుండి వచ్చిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. CEO సి విజయకుమార్ వేదికపైకి వచ్చి ప్రసంగిస్తుండగా, HCL ఉద్యోగులందరూ కలిసి 'మాకు జీతం పెంపు కావాలి' (We want hike) అంటూ నినాదాలు చేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది.

ఈ ఘటన ఉద్యోగుల జీతాలు, పని సంస్కృతి మరియు జీతాల పెంపుపై కొత్త చర్చకు దారితీసింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది.