ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీ. గడువు దాటితే రూ.5,000 వరకు ఆలస్య రుసుము మరియు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీతభత్యాలు పొందే ఉద్యోగులు మరియు పెన్షనర్లు జూలై 31 లోపు తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగింపుపై ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఒకవేళ గడువు ముగిసిన తర్వాత ఫైల్ చేస్తే, సెక్షన్ 234F ప్రకారం మొత్తం ఆదాయం రూ.5 లక్షలకు మించి ఉంటే రూ.5,000 వరకు లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ.1,000 మాత్రమే ఉంటుంది. దీనితో పాటు, బకాయి ఉన్న పన్నుపై నెలకు 1% వడ్డీ కూడా వర్తిస్తుంది. ఆలస్యంగా ఫైల్ చేయడం వల్ల పాత పన్ను విధానాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.