2022 స్పెక్ట్రం వేలం నిబంధనల ప్రకారం నెట్‌వర్క్ విస్తరణ చేయడంలో విఫలమైనందుకు వొడాఫోన్ ఐడియాకు టెలికాం శాఖ నోటీసు ఇచ్చింది. ఈ నోటీసును పరిశీలిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
2022 స్పెక్ట్రం వేలం ద్వారా కేటాయించిన స్పెక్ట్రమ్‌కు సంబంధించి కనీస రోల్అవుట్ నిబంధనలను పాటించడంలో విఫలమైనందున, వొడాఫోన్ ఐడియా సంస్థకు ₹26.83 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని టెలికాం శాఖ (DoT) నోటీసు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ శనివారం వెల్లడించింది.
ఈ ఉల్లంఘన 2022 బిడ్ డాక్యుమెంట్‌లో పేర్కొన్న నెట్‌వర్క్ విస్తరణ బాధ్యతలకు సంబంధించినదని కంపెనీ తెలిపింది. అయితే, ఈ నోటీసు వల్ల తమ కార్యకలాపాలు లేదా ఆర్థిక స్థితిపై ఎటువంటి ప్రభావం ఉండదని వొడాఫోన్ ఐడియా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ నోటీసును సమీక్షిస్తున్నామని కంపెనీ పేర్కొంది.