ప్రభుత్వం తన వాటాను తక్కువ ధరకు విక్రయించబోతున్న వార్తతో LIC షేర్లు ఈరోజు 9% పతనం అయ్యాయి. ప్రభుత్వ OFS ప్రక్రియ వల్ల మార్కెట్లో షేర్ల ధరలు గణనీయంగా తగ్గాయి.
దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ అయిన LIC షేర్లు మంగళవారం మార్కెట్ ప్రారంభం కావడంతోగానే భారీగా పడిపోయాయి. అమ్మకాల ఒత్తిడి కారణంగా LIC షేర్లు సుమారు 9% క్షీణించాయి. ప్రభుత్వం తన వాటాను ప్రస్తుత మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు విక్రయించబోతుందనే వార్త ఈ పతనానికి ప్రధాన కారణం.
ప్రభుత్వం LICలో 6.5% వాటాను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. మొదట OFS ద్వారా 2% వాటాను విక్రయించి, అవసరమైతే మరో 4.5% విక్రయించే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన కనిష్ట ధర రూ. 382, ఇది సోమవారం ముగిసిన మార్కెట్ ధర కంటే సుమారు 11% తక్కువగా ఉండటంతో ఇన్వెస్టర్ల నమ్మకం దెబ్బతింది.