భారతదేశంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన సమయపాలనను గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరించారు.

భారతదేశంలో పాలిమర్ లేదా ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రంగంలోకి దిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఈ కొత్త రకం నోట్లను మార్కెట్లోకి తీసుకురావాలని గవర్నర్ సంజయ్ మల్హోత్రా లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రస్తుత కాగితపు నోట్ల కంటే ఈ పాలిమర్ నోట్లు చాలా కాలం మన్నికగా ఉంటాయి. దీనివల్ల నోట్ల జీవితకాలం పెరగడమే కాకుండా, నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు.