ఉద్యోగం కోల్పోయిన H-1B మరియు ఇతర వీసా కార్లకు లభించే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ DHS ప్లాన్ వల్ల విదేశీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఉద్యోగం కోల్పోయిన H-1B మరియు ఇతర వీసా హోల్డర్లకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేయాలని డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. హోం ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (DHS) ప్రతిపాదించిన ఈ కొత్త నిబంధన వల్ల, ఉద్యోగం పోయిన వెంటనే కొత్త పని కోసం వెతుక్కునే సమయం తగ్గిపోతుంది.
ఈ నిర్ణయం వల్ల భారతీయులు అత్యధికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అమెరికాలో పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయులు H-1B వీసాలపైనే ఆధారపడి ఉన్నారు. ఈ గ్రేస్ పీరియడ్ రద్దయితే, ఉద్యోగం పోయిన వెంటనే కొత్త ఉద్యోగం దొరకకపోతే వారు దేశం విడిచి వెళ్లాల్సి వస్తుంది.