పాన్ మసాలా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్ వాడకాన్ని FSSAI నిషేధించింది. ఇకపై కంపెనీలు కాగితం, టిన్ లేదా గాజు వంటి పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్‌ను మాత్రమే వాడాలి.
పాన్ మసాలా ప్యాకేజింగ్‌పై FSSAI కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఇకపై ప్లాస్టిక్ పౌచ్‌లలో పాన్ మసాలాను విక్రయించకూడదు. కొత్త నిబంధనల ప్రకారం, కంపెనీలు పేపర్, పేపర్ బోర్డ్, సెల్యులోజ్, టిన్ డబ్బాలు లేదా గాజు సీసాల వంటి పర్యావరణ అనుకూల పదార్థాలను మాత్రమే ప్యాకేజింగ్ కోసం ఉపయోగించాలి.
పాలిథిన్, పివిసి లేదా ఏవైనా సింథటిక్ ప్లాస్టిక్ పదార్థాలను ఉపయోగించడాన్ని ఈ నిబంధన పూర్తిగా నిషేధించింది. కాగితం లోపల ప్లాస్టిక్ లేదా అల్యూమినియం ఫాయిల్ పొరలు ఉన్న ప్యాకెట్లను కూడా వాడకూడదు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశ్యం.
పాన్ మసాలా అమ్మకాలపై ఎలాంటి నిషేధం లేదు, కేవలం ప్యాకేజింగ్ విధానంలో మాత్రమే మార్పు చేయాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ నియమాలను పాటించని కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.