ముంబై-అహ్మదాబాద్ మధ్య నడిచే భారతదేశపు మొదటి బుల్లెట్ రైలు పనులు వేగంగా జరుగుతున్నాయి. 2027 ఆగస్టు 15 నాటికి మొదటి దశను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం, ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ రూపం దాల్చుతోంది. దీని మొదటి దశను వచ్చే ఏడాది అంటే 2027, ఆగస్టు 15న ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించారు.

508 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్‌లో విద్యుదీకరణ పనులు (Electrification) వేగంగా జరుగుతున్నాయి. గుజరాత్‌లోని నవసారీ ప్రాంతంలో జరుగుతున్న పనులను మంత్రి వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 22,000 OHE మాస్ట్‌లు మరియు 25,700 క్యాంటిలీవర్ అసెంబ్లీలను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనివల్ల ప్రస్తుతం 6 గంటలు పట్టే ముంబై నుండి అహ్మదాబాద్ ప్రయాణం కేవలం 2 గంటల్లోనే పూర్తవుతుంది. ఈ మార్గంలో మొత్తం 12 ప్రధాన స్టేషన్లు ఉంటాయి.