భారతదేశ ఐదవ తరం యుద్ధ విమానాల (AMCA) కోసం స్వదేశీ కాంబాట్ ఇంజన్లను అభివృద్ధి చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్, రోల్స్-రాయిస్‌తో భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్ట్ భారత రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించనుంది.
భారతదేశ రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధమవుతోంది. భారత ఐదవ తరం యుద్ధ విమానాల (AMCA) కోసం శక్తివంతమైన కాంబాట్ ఇంజన్లను తయారు చేసే లక్ష్యంతో, ప్రముఖ బ్రిటిష్ సంస్థ రోల్స్-రాయిస్‌తో భాగస్వామ్యం కోసం రిలయన్స్ చర్చలు జరుపుతోంది.
ఈ భాగస్వామ్యంలో భాగంగా, ఒక అత్యాధునిక ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేయాలని వారు యోచిస్తున్నారు. ఇది యుద్ధ విమానాల తయారీలో భారతదేశ స్వయం సమృద్ధిని పెంచుతుంది.