స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ భారత్ ఇకపై కేవలం ఒక పెద్ద మార్కెట్‌గా మాత్రమే మిగిలిపోదని, ప్రపంచ మార్కెట్‌ను శాసించే స్థాయికి ఎదగాలని స్పష్టం చేశారు. అమెరికా వంటి దేశాల స్వార్థపూరిత విధానాలకు భారత్ తన స్వంత మార్గాన్ని ఎంచుకోనుంది.
ఎర్రకోటపై ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు పరోక్షంగా గట్టి సమాధానం ఇచ్చారు. ప్రపంచీకరణ పేరుతో దేశాలు తమ స్వార్థం చూసుకుంటున్న తరుణంలో, భారత్ కూడా తన ప్రయోజనాల కోసం నిలబడాలని ఆయన తేల్చి చెప్పారు. భారత్ అనేది కేవలం విదేశీ కంపెనీల వస్తువులను కొనే పెద్ద మార్కెట్ మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్‌ను శాసించే శక్తిగా మారుతుందని ఆయన ప్రకటించారు.
రాబోయే ఏడేళ్లలో దేశంలో భారీ సంస్కరణలు తీసుకురావాలని, తయారీ రంగం (Manufacturing), రక్షణ రంగం మరియు గ్రీన్ ఎకానమీలో స్వయం సమృద్ధి సాధించాలని మోదీ పిలుపునిచ్చారు. దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTA) ద్వారా భారతీయ MSMEలు ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తులను విక్రయించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా భారతీయ బ్రాండ్ విలువను పెంచడమే లక్ష్యమని స్పష్టం చేశారు.