అమెరికాలోని ఐడాహో ట్విన్ ఫాల్స్‌లో ఉన్న ఇన్-ఎన్-అవుట్ రెస్టారెంట్‌లో జరిగిన కాల్పుల్లో పలువురు మరణించారు. ఈ దాడి సమయంలో జోర్డాన్ సాలినాస్ అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి, రైఫిల్ కలిగిన దుండగుడిని తన పిస్టల్‌తో ఎదుర్కొన్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అతనిని రియల్ హీరోగా అభివర్ణిస్తున్నారు.
అమెరికాలోని ఐడాహో ట్విన్ ఫాల్స్ పరిధిలోని ఇన్-ఎన్-అవుట్ రెస్టారెంట్‌లో ఘోరమైన కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో పలువురు మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో తమ రెస్టారెంట్ ఉద్యోగి ఒకరు ఉన్నారని ఇన్-ఎన్-అవుట్ ప్రెసిడెంట్ లిన్సీ స్నైడర్ తీవ్ర భావోద్వేగంతో ధృవీకరించారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. దాడి చేసిన వ్యక్తి చేతిలో పెద్ద రైఫిల్ ఉన్నప్పటికీ, జోర్డాన్ సాలినాస్ అనే వ్యక్తి ఏమాత్రం భయపడకుండా తన వద్ద ఉన్న చిన్న పిస్టల్‌తో అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ప్రాణాలకు తెగించి ఇతరులను రక్షించేందుకు ప్రయత్నించిన జోర్డాన్ ధైర్యసాహసాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.