అన్నమయ్య జిల్లా కురబాలకోట మండలం అంగల్లు గ్రామంలో గంజాయి మరియు నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను అరికట్టేందుకు వందలాది మంది పోలీసులు భారీ సోదాలు నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా కురబాలకోట మండలం పరిధిలోని అంగల్లు గ్రామంలో శనివారం తెల్లవారుజామున వందకు పైగా పోలీసులు భారీ స్థాయిలో కోటడ・సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల విక్రయాల వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక చర్య చేపట్టామని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు.
పోలీసు బృందాలు గ్రామంలోని వీధులు, ఇళ్లు మరియు అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయి మరియు నిషేధిత పొగాకు ఉత్పత్తుల సరఫరా చేసే ముఠాలను పట్టుకోవడానికి ఈ సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో పత్రాలు లేని వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు.