అహ్మదాబాద్‌లోని ఒక పిజి నివాసంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు, 23 ఏళ్ల విద్యార్థినిని టెర్రస్ పైకి తీసుకెళ్లి, మెడకు వైరు చుట్టి అత్యాచారం చేశాడు.

అహ్మదాబాద్‌లో ఒక పిజి (PG) నివాసంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు అత్యంత దారుణమైన నేరానికి పాల్పడ్డాడు. 23 ఏళ్ల ఇంటీరియర్ డిజైన్ విద్యార్థినిని టెర్రస్ పైకి తీసుకెళ్లి, ఆమె మెడకు వైరు చుట్టి, అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

నిందితుడు ఆ పిజిలో ఉద్యోగంలో చేరి కేవలం నాలుగు రోజుల్లోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.