ధర్మ సింగ్ అనే సెక్యూరిటీ గార్డ్ 23 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. లిఫ్టు ద్వారా ఆమెను టెర్రస్‌పైకి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

నిందితుడు సదరు మహిళను బలవంతంగా పట్టుకుని లైంగిక సంబంధం కోరినట్లు తెలుస్తోంది. ఆమె నిరాకరించడంతో, నిందితుడు ఆమె మెడకు వైర్‌ను చుట్టి బెదిరించి అత్యాచారం చేశాడు.

ఈ ఘోరకృత్యం చేసిన 90 నిమిషాల తర్వాత అతను తిరిగి కిందకు వచ్చాడని పోలీసులు తెలిపారు.