రేణుకస్వామి హత్య కేసు విచారణలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన పవిత్ర గౌడ, హెడ్‌ఫోన్‌లు ఉపయోగించడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి అనుమతి ఎవరు ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు.

రేణుకస్వామి హత్య కేసులో నటుడు దర్శన్‌తో సహా నిందితుల చట్టపరమైన పోరాటం కొనసాగుతోంది. 59వ సిసిహెచ్ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టులో అప్పీల్ చేసిన నేపథ్యంలో ఈరోజు విచారణ జరిగింది. జైలులో ఉన్న నిందితులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు.

విచారణ జరుగుతున్న సమయంలో పవిత్ర గౌడ హెడ్‌ఫోన్‌లు ఉపయోగించడం న్యాయమూర్తి దృష్టికి వచ్చింది. దీనిని గమనించిన జడ్జి, హెడ్‌ఫోన్‌లు వాడటానికి ఎవరి అనుమతి తీసుకున్నారని అధికారులను తీవ్రంగా ప్రశ్నించారు.