మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో విద్యుత్ బిల్లు విషయంలో వివాదం తలెత్తడంతో, ఒక ఇంటి యజమాని తన పెంపుడు కుక్కలను విద్యుత్ శాఖ సిబ్బందిపైకి వదిలి దాడి చేశారు.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా హజైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్‌లో ఈ ఘటన జరిగింది. విద్యుత్ వినియోగ యూనిట్లను నమోదు చేయడానికి వెళ్లిన ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులపై బీరు తోమార్ అనే వ్యక్తి దాడి చేశాడు. బిల్లు విషయంలో వాగ్వాదం జరిగిన తర్వాత, నిందితుడు తన వద్ద ఉన్న రోట్‌వైలర్, పిట్‌బుల్ మరియు జర్మన్ షెపర్డ్ జాతి కుక్కలను ఉద్యోగుల మీదకు వదిలాడు.

ఈ దాడిలో ఒక ఉద్యోగి కుక్కల వల్ల గాయపడ్డారు. నిందితుడు ఉద్యోగులను శారీరకంగా కొట్టడమే కాకుండా, వారి మీటర్ రీడింగ్ యంత్రాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు బీరు తోమర్‌ను అరెస్ట్ చేసి, భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.