విజయవాడలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనుల కోసం రూ.15 లక్షల లంచం డిమాండ్ చేసిన రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బాపిరాజును సీబీఐ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

విజయవాడలో జరిగిన ఒక భారీ అవినీతి కేసులో రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బాపిరాజును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనుల క్రమంలో రూ.15 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

ఈ విషయంపై సీబీఐ అధికారులకు ఫిర్యాదు అందడంతో, అధికారులు ట్రాప్ వేసి బాపిరాజును లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో ఆయనతో పాటు శ్రీచందన్ అనే ప్రైవేటు వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.