'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' వంటి ప్రసిద్ధ నవలల ద్వారా గుర్తింపు పొందిన ప్రముఖ జపనీస్ నవోకి అవార్డు గ్రహీత, రచయిత కీగో హిగాషినో (68) కోలన్ క్యాన్సర్‌తో కన్నుమూశారు.
ప్రపంచవ్యాప్తంగా మిస్టరీ, సస్పెన్స్ నవలల ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ జపనీస్ రచయిత కీగో హిగాషినో (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా కోలన్ క్యాన్సర్ (పెద్దపేగు క్యాన్సర్)తో బాధపడుతున్న ఆయన, జూలై 23న తుదిశ్వాస విడిచినట్లు జపనీస్ మీడియా వెల్లడించింది.
ఒసాకాలో జన్మించిన కీగో హిగాషినో, తన అద్భుతమైన కథన శైలితో జపనీస్ సాహిత్య రంగంలో ప్రత్యేక ముద్ర వేశారు. ఆయన రాసిన 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' (Yogisha X no Kenshin), 'జర్నీ అండర్ ది మిడ్‌నైట్ సన్' (Byakuyako) వంటి నవలలు అంతర్జాతీయంగా అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలుగా నిలిచాయి. వీటి ఆధారంగా పలు భాషల్లో సినిమాలు, టీవీ సీరియళ్లు కూడా రూపుదిద్దుకున్నాయి.