పంజాబ్ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో వర్షం తర్వాత నీరు నిలిచిన ప్రాంతంలో విద్యుత్ షాక్‌కు గురై 26 ఏళ్ల పిహెచ్‌డీ స్కాలర్ జ్యోతి మరణించారు. ఈ ఘటనపై విద్యార్థులు తీవ్రంగా స్పందిస్తూ నిరసనలు చేపట్టారు.
పంజాబ్ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో మంగళవారం ఉదయం వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఈ నీటిలో నడుస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై 26 ఏళ్ల పిహెచ్‌డీ పరిశోధకురాలు జ్యోతి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహం విద్యుత్ స్తంభం వద్ద లభించింది.
ఈ ప్రమాదంతో ఆగ్రహించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) యూనివర్సిటీ యంత్రాంగానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది. క్యాంపస్‌లో భద్రతా ఏర్పాట్లు సరిగ్గా లేవని, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ మరణం సంభవించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.