రామానంద్ సాగర్ రూపొందించిన 'రామాయణం' సిరీల్‌లో ఆధునిక VFX లేకపోయినా, అద్భుతమైన సృజనాత్మకతతో అద్భుత దృశ్యాలను సృష్టించారు.
రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన 'రామాయణం' భారతీయ టెలివిజన్ చరిత్రలో ఒక అద్భుతం. ఆ రోజుల్లో ఆధునిక VFX సాంకేతికత అందుబాటులో లేనందున, కళాకారులు చాలా తక్కువ వనరులతో అద్భుతమైన ఫలితాలను సాధించారు.
నగలు కోసం కాగితంపై రంగులు వేసి ఆకృతులను తయారు చేసేవారు. పొగ వంటి దృశ్యాల కోసం అగరుబత్తులను ఉపయోగించేవారు. రాముడు మరియు సీతలకు అవసరమైన వస్త్రాలను 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక సంస్థ తయారు చేసింది. ఈ సృజనాత్మకత వల్లే ఆ సిరీస్ నేటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోయింది.