ప్రైమ్ వీడియో రియాలిటీ షో 'అలయ్న్స్'లో సల్మాన్ ఖాన్ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. తన తమ్ముడు సోహైల్ ఖాన్‌ను కలవడానికి వచ్చిన సల్మాన్, అందరినీ ఆశ్చర్యపరిచారు.

ప్రైమ్ వీడియోలో వస్తున్న 'అలయ్న్స్' రియాలిటీ షో కొత్త ప్రోమోలో సల్మాన్ ఖాన్ కౌబాయ్ లుక్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. షో సిస్టమ్ హ్యాక్ అయినట్లు కనిపించగానే, సల్మాన్ రాకతో కంటెస్టెంట్స్ అందరూ షాక్ అయ్యారు.

సల్మాన్ తన తమ్ముడు సోహైల్ ఖాన్‌ను కలవడానికి షోకు వచ్చారు. సోహైల్‌ను చూడగానే సల్మాన్ భావోద్వేగానికి గురై అతడిని హత్తుకున్నారు. సోహైల్ గత కొన్ని రోజులుగా ఒత్తిడిలో ఉన్నందున, అతనికి ధైర్యం చెప్పడానికి సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.