సోషల్ మీడియాలో తన శరీరంపై వచ్చిన విమర్శలకు జార్జినా రోడ్రిగ్జ్ గట్టిగా సమాధానం ఇచ్చారు. శారీరక రూపం మనిషి విలువను నిర్ణయించదని, ఆమెకు అండగా నిలిచిన వ్యక్తి రొనాల్డో అని పేర్కొన్నారు.
స్పానిన్‌లో సెలవుల సమయంలో జార్జినా రోడ్రిగ్జ్ వేసుకున్న బికినీ ఫోటోలపై నెటిజన్లు బాడీ షేమింగ్ చేయడంపై ఆమె స్పందించారు. తల్లి అయిన తర్వాత శరీరంలో మార్పులు రావడం సహజమని, శరీర బరువు లేదా ఆకృతి మనిషి విలువను నిర్ణయించదని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.
సరైన శరీరం అంటే ఏమిటి? దాని ప్రమాణాలు ఎవరు నిర్ణయిస్తారు? అని ఆమె ప్రశ్నించారు. ఒకానొక సమయంలో ఈ విమర్శలు తనను బాధించాయని, అప్పుడు క్రిస్టియానో రొనాల్డో తనకు ధైర్యం చెప్పారని ఆమె గుర్తు చేసుకున్నారు. 'నేను నీ శరీరాన్ని మాత్రమే ప్రేమించడం లేదు, ఒక స్త్రీగా మరియు తల్లిగా నీ వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తున్నాను' అని రొనాల్డో తనకు చెప్పారని ఆమె వివరించారు.
తన పిల్లలకు కూడా ఇదే విషయాన్ని నేర్పించాలనుకుంటున్నట్లు జార్జినా తెలిపారు. మనుషుల విలువ వారి శారీరక రూపంపై లేదా ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడి ఉండదని తన పిల్లలు తెలుసుకోవాలని ఆమె కోరుకుంటున్నారు.