షూటింగ్ బాధ్యతలను నెరవేర్చడానికి తీవ్ర అనారోగ్యంతో ఉన్నా సరే షూటింగ్‌కు వెళ్లిన నటి అవికా గోర్ చివరకు ఆసుపత్రిలో చేరారు. ఆమెకు డెంగ్యూ సోకినట్లు తేలింది.
నటి అవికా గోర్ గత ఐదు రోజులుగా 103-104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారు. శరీరం ఎంత బలహీనంగా ఉన్నా, షూటింగ్ ప్రామిస్ కోసం ఆమె సెట్‌కు వెళ్లారు. చివరకు ఆమె పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్చారు. రక్త పరీక్షల అనంతరం ఆమెకు డెంగ్యూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
అవికా భర్త మిలింద్ చంద్వానీ తెలిపిన వివరాల ప్రకారం, షూటింగ్ వాయిదా వేయమని ఆమెను పదేపదే కోరినప్పటికీ, అవికా ఒప్పుకోలేదు. పని ఆలస్యం చేస్తే ఇతరుల సమయం మరియు డబ్బు వృధా అవుతాయని ఆమె వాదించారు. ఆమె పని పట్ల చూపిస్తున్న అంకితభావం అద్భుతమని ఆయన కొనియాడారు.
షూటింగ్ టీమ్ సభ్యులు కూడా ఆమె ఎంత నీరసంగా ఉన్నారో వివరించారు. ఆమె సరిగ్గా నిలబడలేకపోయినా, ఓఆర్‌ఎస్‌పై ఆధారపడి షూటింగ్ పూర్తి చేయడానికి ప్రయత్నించారు.