మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళా ప్రధాన చిత్రాల ప్రపంచవ్యాప్త ఓపెనింగ్ కలెక్షన్లలో విస్మయ మోహన్ లాల్ నటించిన 'తుడక్కం' సరికొత్త రికార్డు సృష్టించి, 'లోకా' సినిమాను అధిగమించింది.
విస్మయ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన 'తుడక్కం' చిత్రం బాక్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన నాలుగో రోజు నాటికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 26.82 కోట్ల ఆదాయాన్ని గడించి, మహిళా ప్రధాన మలయాళ చిత్రాల చరిత్రలో అత్యధిక ఓపెనింగ్‌ను నమోదు చేసింది.
ఒక సాధారణ రివెంజ్ థ్రిల్లర్ అయినప్పటికీ, విస్మయ ప్రదర్శించిన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలు చిత్రానికి కొత్త ఊపిరి పోశాయని విమర్శకులు ప్రశంసిస్తున్నారు.