హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గోస్లింగ్ 2007లో వచ్చిన 'లార్స్ అండ్ ది రియల్ గర్ల్' సినిమా కోసం ఒక సెక్స్ డాల్‌తో కలిసి జీవించినట్లు వెల్లడించారు. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఆ బొమ్మను తన ఇంటికి తీసుకెళ్లి, దాంతో మాట్లాడేవాడినని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం హాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ర్యాన్ గోస్లింగ్ ఒకరు. అయితే, 2007లో ఆయన నటించిన 'లార్స్ అండ్ ది రియల్ గర్ల్' అనే విభిన్నమైన చిత్రం కోసం ఆయన చేసిన ప్రయత్నం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమాలో ఆయన 'బియాంకా' అనే సెక్స్ డాల్‌ను ప్రాణంగా ప్రేమించే యువకుడి పాత్రలో నటించారు.
ఈ పాత్రలో జీవించడానికి ర్యాన్ ఆ బొమ్మను షూటింగ్ తర్వాత తన ఇంటికి తీసుకువెళ్లి, ఒక గదిలో ఉంచారు. ఆ బొమ్మకు కాఫీ కప్పు, పుస్తకం ఇచ్చి నిజమైన మనిషిలా చూసుకునేవారట. దాంతో డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ, గొడవ పడుతూ ఉండేవారట. ఈ అనుభవం వింతగా అనిపించినప్పటికీ, ఆ బొమ్మ తనకొక భద్రతా భావాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు.