ప్రముఖ సింగర్ సుకృతి కక్కర్, బిజినెస్‌మెన్ సౌమిక్ శెట్టితో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి రొమాంటిక్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ గాయని సుకృతి కక్కర్ మరియు ముంబైకి చెందిన బిజినెస్‌మెన్ సౌమిక్ శెట్టి తమ నిశ్చితార్థాన్ని ప్రకటించుకున్నారు. అందమైన పర్వత ప్రాంతాలలో సౌమిక్ మోకాలిపై నిలబడి సుకృతికి రింగ్ వేసి ప్రపోజ్ చేసిన దృశ్యాలు ఎంతో రొమాంటిక్‌గా ఉన్నాయి. వీరిద్దరి కెమిస్ట్రీని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఈ సందర్భంలో సారా టెండూల్కర్, అర్మాన్ మలిక్ వంటి సెలబ్రిటీలు వారికి శుభాకాంక్షలు తెలిపారు. సౌమిక్ శెట్టి లగ్జరీ ప్యాడిల్ క్లబ్ కోర్ట్‌సైడ్ కో-ఫౌండర్. వీరి వివాహ తేదీ గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.