మణిపూర్‌లోని ఉఖ్రూల్ జిల్లాలో సాయుధ దుండగులు పాస్‌పోర్ట్‌లు, ఏటీఎం కార్డులు ఉన్న పోస్టల్ వ్యాన్‌ను తగలబెట్టారు. ఈ ఘటనతో పోస్టల్ శాఖ తీవ్రంగా దెబ్బతిన్నది.
మణిపూర్ లోని ఉఖ్రూల్ జిల్లాలో నేషనల్ హైవే 202 వెంట ఇంఫాల్ నుండి పోస్టల్ వస్తువులను తరలిస్తున్న వ్యాన్‌ను గుర్తుతెలియని దుండగులు అడ్డుకున్నారు. ఈ దాడిలో 35 మెయిల్ బ్యాగులను నిప్పు అంటించారు. వీటిలో పాస్‌పోర్ట్‌లు, ఏటీఎం కార్డులు, విద్యా ధృవీకరణ పత్రాలు మరియు ఇతర ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి.
దాడి చేసిన వారు ఆర్థిక దిగ్బంధనానికి మద్దతుదారులుగా చెప్పుకున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంఫాల్ ప్రధాన పోస్టల్ కార్యాలయ ఉద్యోగులు ఒక రోజు నిరసన చేపట్టారు. తగిన భద్రత లభించే వరకు ఉఖ్రూల్ జిల్లా పోస్టల్ కార్యాలయ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.