జైపూర్‌లోని ఒక బాయ్స్ హాస్టల్‌లోకి అతివేగంగా వచ్చిన మహీంద్రా థార్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనపై పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకువచ్చిన ఒక థార్ కారు నేరుగా బాయ్స్ హాస్టల్ భవనాన్ని ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భవన గోడలు దెబ్బతిన్నాయి.
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అతివేగంగా వాహనాన్ని నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.