కార్నియా దాతల కొరతను అధిగమించేందుకు ఢిల్లీ AIIMS కృత్రిమ కార్నియా ట్రాన్స్‌ప్లాంట్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే కొంతమంది రోగులలో ఈ ప్రక్రియ విజయవంతమైంది.
భారతదేశంలో కార్నియల్ బ్లైండ్‌నెస్‌తో బాధపడుతున్న లక్షలాది మందికి కార్నియా ట్రాన్స్‌ప్లాంట్ ఒక్కటే మార్గం. అయితే దాతల కొరత కారణంగా చికిత్సలో జాప్యం జరుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఢిల్లీ AIIMSలోని RP సెంటర్ కృత్రిమ కార్నియాపై పరిశోధనలు చేసి, పరిమిత సంఖ్యలో రోగులకు దీనిని అమర్చింది.
దేశంలో దాదాపు 8.2 శాతం మంది కార్నియా అంధత్వంతో బాధపడుతున్నారు. ప్రతి ఏటా లక్షకు పైగా కార్నియాల అవసరం ఉన్నప్పటికీ, అందుబాటులో ఉన్నవి కేవలం 3 శాతం మాత్రమే. ఈ నేపథ్యంలో, దాతలు లభించని వారికి కృత్రిమ కార్నియా ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా మారింది. ఇప్పటివరకు సుమారు 20 మందికి ఈ చికిత్స అందించారు.