బలూచిస్తాన్‌లోని BLA గ్రూప్‌పై కఠిన చర్యలు తీసుకోవడానికి పాకిస్థాన్ సైన్యం సిద్ధమవుతోంది. అదే సమయంలో గిల్గిత్-బాల్టిస్తాన్‌ను పాకిస్థాన్ ఐదవ రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

బలూచిస్తాన్‌లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పై భారీ సైనిక చర్య చేపట్టడానికి పాకిస్థాన్ సైన్యం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్‌పై కొత్తగా ఆరోపణలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

మరోవైపు, గిల్గిత్-బాల్టిస్తాన్‌ను పాకిస్థాన్‌కు ఐదవ రాష్ట్రంగా మారుస్తూ అసెంబ్లీలో ప్రతిపాదన ఆమోదం పొందింది. పాక్ నియంత్రణలో ఉన్న కాశ్మీర్ ప్రాంతంపై పాకిస్థాన్ కొత్త కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తోంది.