ఉక్రెయిన్ దాడుల వల్ల రష్యాలోని రిఫైనరీలు దెబ్బతినడంతో అక్కడ తీవ్ర ఇంధన కొరత ఏర్పడింది. ఈ క్లిష్ట పరిస్థితి నుండి బయటపడటానికి రష్యా ఇప్పుడు భారత్ నుండి పెట్రోల్‌ను దిగుమతి చేసుకుంటోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయిన రష్యా ప్రస్తుతం ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ చేపట్టిన డ్రోన్ మరియు క్షిపణి దాడుల వల్ల రష్యా యొక్క రిఫైనింగ్ సామర్థ్యం సుమారు 40% క్షీణించింది. రష్యా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న రిఫైనరీలను ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకుటంతో పుతిన్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడింది.
గతంలో రష్యా భారతదేశం నుండి భారీగా ముడి చమురును దిగుమతి చేసుకునేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత్ ఆ ముడి చమురును శుద్ధి చేసి, పెట్రోల్ మరియు డీజల్‌గా మార్చి తిరిగి రష్యాకు ఎగుమతి చేస్తోంది. ఇటీవల గుజరాత్‌లోని నయారా ఎనర్జీ రిఫైనరీ నుండి 60,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్‌ను రష్యాకు ఎగుమతి చేశారు. అంతర్జాతీయ వాణిజ్య సంస్థల ద్వారా ఈ సరఫరా జరుగుతోంది.
ఇంధన కొరత కారణంగా రష్యాలోని 55 ప్రాంతాలలో పెట్రోల్, డీజిల్ రేషన్ పద్ధతిలో పంపిణీ చేస్తున్నారు. ఇంధన ధరలు కూడా భారీగా పెరిగాయి. రష్యా నుండి ఇంధన ఎగుమతులపై పుతిన్ ప్రభుత్వం ఆంక్షలు విధించడమే కాకుండా, తక్కువ నాణ్యత కలిగిన ఇంధనాన్ని ఉత్పత్తి చేసి లోపలి అవసరాలను తీసుకోమని చమురు కంపెనీలకు ఆదేశించింది.