ఇండోనేషియాలోని మదురా ద్వీపం సమీపంలో ఫెర్రీ బోటులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 గురు మరణించగా, 41 మంది కనిపించకుండా పోయారు.

ఇండోనేషియాలోని మదురా ద్వీపం వద్ద ప్రయాణిస్తున్న ఫెర్రీ బోటులో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగాయి. ఆ బోటులో మొత్తం 271 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటల తీవ్రత పెరగడంతో ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయాణికులు సముద్రంలోకి దూకారు.

ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు 5 గురు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మరుగున పడిన 41 మందిని వెతకడానికి సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.