హార్ముజ్ జలసంధిని త్వరలో అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఆదేశాల మేరకు మాత్రమే తెరవగలమని లేదా మూసివేయగలమని టెహ్రాన్ తేల్చి చెప్పింది.
ఇరాన్‌ను "పూర్తిగా ఓడించి", హార్ముజ్ జలసంధిని "త్వరలో" అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ తీవ్ర ప్రతిస్పందించింది.
హార్ముజ్ జలసంధిపై నియంత్రణ కేవలం ఇరాన్ వద్దే ఉంటుందని, అది ఇరాన్ ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తుందని టెహ్రాన్ స్పష్టం చేసింది. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం మాటలకే పరిమితమని ఇరాన్ పేర్కొంది.