ఇరాన్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవనోపాధి కోసం మహిళలు తమ వెంట్రుకలను కూడా అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది.

ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్రంగా మారింది. వార్షిక ద్రవ్యోల్బణం 87 శాతానికి పైగా చేరుకోవడంతో, సామాన్య ప్రజలు తమ ప్రాథమిక అవసరాలను తీర్చుకోలేక పోతున్నారు.

ఈ క్లిష్ట పరిస్థితుల వల్ల, చాలా మంది మహిళలు ఆహారం కోసం తమ వెంట్రుకలను అమ్ముకుంటున్నారు. కేవలం వెంట్రుకలే కాకుండా, బట్టలు మరియు ఇతర వస్తువులను కూడా అమ్ముకుంటూ ప్రజలు కష్టాల్లో మగ్గుతున్నారు.