వైట్ హౌస్‌లో 400 మిలియన్ డాలర్ల భారీ బాల్‌రూమ్ నిర్మాణ ప్రాజెక్టును అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు అడ్డుకుంది. కాంగ్రెస్ అనుమతి లేకుండా వైట్ హౌస్‌లో ఇటువంటి మార్పులు చేయలేరని కోర్టు స్పష్టం చేసింది.
అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకమైన వైట్ హౌస్ బాల్‌రూమ్ ప్రాజెక్టుపై స్టే విధించింది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 400 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,500 కోట్లు) ఖర్చు చేయాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది.
'ప్రతి అధ్యక్షుడు వైట్ హౌస్‌కు తాత్కాలిక అద్దెదారు మాత్రమే, యజమాని కాదు' అని కోర్టు తన తీర్పులో పేర్కొంది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా కార్యనిర్వాహక శాఖ వైట్ హౌస్ నిర్మాణంలో ఇటువంటి భారీ మార్పులు చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ ప్రేరేపిత నిర్ణయమని, భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై తదుపరి పోరాటం కోసం ట్రంప్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది.