అమెరికాలోని ఓహాయో రాష్ట్రం క్లీవ్‌లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కెంట్‌ స్టేట్ యూనివర్సిటీ విద్యార్థి దిలీప్ కుమార్ బుంగటావుల మరణించారు. ఒక పిక్అప్ ట్రక్కు కారును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. ఓహాయో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్‌లో నివసిస్తున్న దిలీప్ కుమార్ బుంగటావుల కారు ప్రమాదానికి గురై మరణించారు. ఎదురుగా వేగంగా వస్తున్న ఒక పిక్అప్ ట్రక్కు దిలీప్ ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.

దిలీప్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా జెట్టివారిపాలెం గ్రామానికి చెందినవారు. ఆయన కెంట్‌ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఈ విషాద ఘటనపై న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.