అమెరికా యుద్ధనౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నుండి అమెరికన్ నావికులు సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు యత్నించినట్లు వార్తలు వచ్చాయి. మధ్యప్రాచ్యంలో ఇరాన్‌తో ఉద్రిక్తతల మధ్య విధుల్లో ఉన్న సైనికులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ప్రచారం జరగగా, అమెరికా సెంట్‌కామ్ (CENTCOM) దీనిపై స్పష్టతనిచ్చింది.

మధ్యప్రాచ్యంలో మోహరించిన అమెరికా యుద్ధనౌక 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్' నుండి అమెరికా నావికులు సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు యత్నించినట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా సుదీర్ఘకాలంగా విధుల్లో ఉన్న సుమారు 5,000 మంది సైనికులు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఈ వార్తల సారాంశం.

అయితే, ఈ వార్తలను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) మరియు రక్షణ అధికారులు తీవ్రంగా ఖండించారు. యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌కు సంబంధించిన వార్తలను తప్పుడు రీతిలో ప్రచారం చేశారని వారు స్పష్టం చేశారు.

తీవ్ర అలసటకు గురైన సైనికులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు అమెరికా తగిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 'యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్' యుద్ధనౌకను మధ్యప్రాచ్యానికి పంపించింది. ఇది యూఎస్ఎస్ అబ్రహం లింకన్ స్థానాన్ని భర్తీ చేయనుంది, తద్వారా అలసిపోయిన సైనికులు తమ ఇళ్లకు చేరుకోనున్నారు.