రాజమహేంద్రవరంలోని డౌలేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో 175 గేట్లు ఎత్తి 2.25 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
రాజమహేంద్రవరంలోని డౌలేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్యారేజీ వద్ద నీటి మట్టం 10.90 అడుగులకు చేరుకోవడంతో, అధికారులు మొత్తం 175 గేట్లను ఎత్తి 2.25 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు సమీపంలోని దేవీపట్నంలో గోదావరి నది అత్యంత ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు గండిపోచమ్మ అమ్మవారి ఆలయ గోపురం వరకు చేరుకుంది. వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు త్వరలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.