గుజరాత్ మోర్బీ జిల్లా వీర్‌పర్డా గ్రామంలోని ఒక బావిలో నీరు అకస్మాత్తుగా అలల్లా ఎగసిపడుతోంది. దీనిని భూకంపం అనుమానిస్తున్న ప్రజలకు శాస్త్రవేత్తలు కొత్త వివరణ ఇచ్చారు.
గుజరాత్‌లోని మోర్బీ జిల్లా వీర్‌పర్డా గ్రామంలోని ఒక రైతు పొలంలో ఉన్న బావిలో నీరు వింతగా ప్రవర్తిస్తోంది. చుట్టుపక్కల ఉన్న ఇతర బావుల్లో నీరు నిశ్చలంగా ఉన్నప్పటికీ, ఈ బావిలోని నీరు మాత్రం అప్పుడప్పుడు అలల్లా ఎగసిపడుతోంది. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఘటనను భూకంపం అనుమానిస్తున్న స్థానికులకు భౌగోళిక శాస్త్రవేత్తలు స్పష్టత ఇచ్చారు. భారీ వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరిగినప్పుడు, భూమిలోని రాళ్ల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాల నుండి గాలి బయటకు వచ్చే క్రమంలో ఈ నీటి కదలికలు ఏర్పడతాయని వారు వివరించారు. మోర్బీ జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయాన్ని పరిశీలించి, ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని సూచించారు.