బివండి వేర్‌హౌస్‌లోని గడువు ముగిసిన మరియు పాడైపోయిన ఉత్పత్తులను మహారాష్ట్ర FDAకు అప్పగించాలని బాంబే హైకోర్టు అమెజాన్ రిటైల్ ఇండియాను ఆదేశించింది. వీటిని శాస్త్రీయంగా నిర్ములించే ఖర్చును అమెజానే భరించాలి.
బివండి వేర్‌హౌస్‌లో ఉన్న గడువు ముగిసిన మరియు పాడైపోయిన అన్ని ఉత్పత్తులను శాస్త్రీయ నిర్ములన కోసం మహారాష్ట్ర FDAకు అప్పగించాలని బాంబే హైకోర్టు సోమవారం అమెజాన్ రిటైల్ ఇండియాను ఆదేశించింది. ఈ ప్రక్రియకు సంబంధించి అమెజాన్ ఒక ఇన్వెంటరీని సిద్ధం చేసి సంబంధిత FDA అధికారికి అందించాలని కోరింది.
లైసెన్స్ రద్దుకు సంబంధించిన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు ఈ మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. ఈ అంశంపై ఆగస్టు 27వ తేదీలోగా FDA తన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ వ్యయమంతా అమెజాన్ సంస్థే భరించాల్సి ఉంటుంది.