వివాదాస్పద FCRA సవరణ బిల్లు 2026ను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాంగ్రెస్, TMC ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.
వివాదాస్పద FCRA (Foreign Contribution Regulation) సవరణ బిల్లు 2026ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు, దానిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపే అంశంపై కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రధాని మోదీతో సమావేశమైన అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు లోక్‌సభ స్పీకర్‌ను కలిశారు. బిల్లుపై పార్లమెంట్‌లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఆయన ప్రతిపక్ష నాయకులతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు.
అయితే, ఈ బిల్లును కేవలం JPCకి పంపడం సరిపోదని, దీనిని పూర్తిగా ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ మరియు TMC డిమాండ్ చేస్తున్నాయి. DMK ప్రతినిధి బృందం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి బిల్లును రద్దు చేయాలని కోరింది. ప్రభుత్వం ప్రతిపక్షాలను ఒప్పించి బిల్లును JPCకి అప్పగిస్తుందా లేదా ప్రస్తుత రూపంలోనే ముందుకు తీసుకెళ్తుందా అన్నది చూడాలి.