డ్యూటీలో ఉన్నప్పుడు తుపాకులను ఉపయోగించే మధ్యప్రదేశ్‌ అటవీ శాఖ సిబ్బందికి ప్రభుత్వం చివరకు చట్టపరమైన రక్షణ కల్పించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అటవీ సిబ్బందికి విధుల్లో ఉన్నప్పుడు ఆయుధాలను ఉపయోగించుకోవడానికి చట్టపరమైన రక్షణ కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో పోలీస్ మరియు పారామిలిటరీ బలగాలకు ఉన్న రక్షణ అటవీ సిబ్బందికి లేకపోవడంతో, విధుల్లో కాల్పులు జరిపినప్పుడు వారిపై హత్య కేసులతో సహా అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యేవి.

భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 218(2) ప్రకారం, ఇప్పుడు వారికి రక్షణ లభిస్తుంది. దీనివల్ల ఏదైనా కాల్పుల ఘటన జరిగినప్పుడు, నేరుగా FIR నమోదు చేయకుండా ముందుగా మెజిస్ట్రేట్ విచారణ జరిపే అవకాశం ఉంటుంది.