భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో రహదారి మరియు మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు.

భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో రహదారి, మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలిసి పలు అభివృద్ధి పనులపై వినతిపత్రం అందజేశారు.

హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి 163ని ఆరు లైన్లుగా విస్తరించడంతో పాటు ఐటీఐ-రామకృష్ణాపురం క్రాస్‌రోడ్డు, స్వర్ణగిరి ఆలయం, సింగన్నగూడెం వద్ద అండర్‌పాస్‌లు, సర్వీసు రోడ్లు నిర్మించాలని ఆయన కోరారు. భువనగిరి కేంద్రీయ విద్యాలయం వద్ద సర్వీసు రోడ్లు, పగిడిపల్లి 12వ వార్డులో డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఈ పనులను త్వరితగతిన చేపట్టాలని కోరారు.