నల్సార్ (NALSAR) తర్వాత ఇప్పుడు బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU)లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా పర్యటనపై వివాదం నెలకొంది. వీరి రాకను వ్యతిరేకిస్తూ 702 మంది విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లోని నల్సార్ (NALSAR) లా యూనివర్సిటీ తర్వాత, ఇప్పుడు బెంగళూరులోని ప్రతిష్టాత్మక నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU)లో వివాదం చెలరేగింది. యూనివర్సిటీ దీక్షాంత మహోత్సవానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మరియు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రాలను ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 702 మంది విద్యార్థులు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.

విద్యార్థుల తీవ్ర నిరసనల నేపథ్యంలో బార్ కౌన్సిల్ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా లా విద్యార్థులకు క్షమాపణలు చెప్పారు. విద్యార్థులకు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే పూర్తి స్వేచ్ఛ ఉందని ఆయన లేఖ ద్వారా పేర్కొన్నారు. అయినప్పటికీ, బార్ కౌన్సిల్ తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలపై విద్యార్థులలో ఉన్న అసంతృప్తి ఈ నిరసనల ద్వారా మరోసారి బహిర్గతమైంది.