ఆగ్రాలో నీటితో నిండిన ఒక డ్రైన్‌లోకి టెంపో పడిపోయిన ఘటన చోటుచేసుకుంది. క్రేన్ సహాయంతో డ్రైన్‌లో చిక్కుకున్న ఐదుగురు వ్యక్తులను సురక్షితంగా రక్షించారు.
ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒక టెంపో నీటితో నిండి ఉన్న డ్రైన్‌లోకి పడిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. డ్రైన్‌లో నీరు ఎక్కువగా ఉండటంతో రక్షణ చర్యలు కష్టతరమయ్యాయి, చివరకు క్రేన్ ఉపయోగించి ఐదుగురు వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.