ప్రధాని నరేంద్ర మోదీ సలహా మేరకు కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆయన రైల్వే సహాయ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు తన పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(2) ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన రాజీనామాను తక్షణమే ఆమోదించారు. రాష్ట్రపతి భవన్ నుండి విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వచ్చింది.
రవనీత్ సింగ్ బిట్టు రాజ్యసభ పదవీ కాలం జూన్ 21తో ముగిసిపోయింది. జూన్ 18న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఆయనను అభ్యర్థిగా నిలపలేదు. అయినప్పటికీ, ఆయన రాజీనామా ఇప్పటి వరకు అడగలేదు, కానీ శుక్రవారం ఆయన రాజీనామా ఆమోదం పొందింది. తన రాజీనామా తర్వాత, బిట్టు ఎక్స్ (X) వేదికగా ప్రధానికి మరియు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.