కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. ఆమె ఆర్ఎస్ఎస్‌లో చేరాలని ఆయన సూచించారు.

లోక్‌సభలో ప్రశ్నపత్రాల లీకేజీ నిరోధక బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు.

ప్రియాంకా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. ఆమె ఆర్ఎస్‌ఎస్‌లో చేరితే దేశం పట్ల సరైన విలువలు నేర్చుకునేవారని అన్నారు. అంతేకాకుండా, ఆమె మెదడు సరిగ్గా పనిచేయడానికి గోమూత్రం తాగడం మంచిదని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ కంటే ప్రియాంకా మెరుగ్గా ఉంటారని అనుకున్నానని, కానీ ఆమె మాటలు నిరాశపరిచాయని ఆయన పేర్కొన్నారు.