చైనా న్యూక్లియర్ ఫ్యూజన్ సాంకేతికతతో కృత్రిమ సూర్యుడిని తయారు చేసే దిశగా అడుగులు వేస్తుంటే, సోషల్ మీడియాలో ఎగతాళి చేసిన చిన్న పిల్లలపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయించడంలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారని అరవింద్ కేజరివాల్ విమర్శించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజరివాల్ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించారు. చైనా కృత్రిమ సూర్యుడిని (Artificial Sun) తయారు చేసే దిశగా అద్భుతమైన సాంకేతికతతో ముందుకు వెళ్తుంటే, మన దేశంలో సోషల్ మీడియాలో ప్రధానిని ఎగతాళి చేసిన చిన్న పిల్లలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించడంలో ప్రభుత్వం నిమగ్నమై ఉందని ఆయన ఆరోపించారు.
కేజరివాల్ ఇంకా మాట్లాడుతూ, చైనా భవిష్యత్తు ఇంధన అవసరాల కోసం అణు సంలీన (Nuclear Fusion) సాంకేతికతపై దృష్టి పెడుతుంటే, భారత్‌లో రోడ్లు కూడా సరిగ్గా లేవని, వర్షం పడితే నగరాలు మునిగిపోతున్నాయని మండిపడ్డారు. దేశానికి దూరదృష్టి కలిగిన నాయకుడు అవసరమని ఆయన పేర్కొన్నారు.