E20 పెట్రోల్ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజరివాల్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ట్రంప్‌ను మెప్పించడానికి మోదీ ఇథనాల్‌ను బలవంతంగా రుద్దుతున్నారని ఆయన ఆరోపించారు.
E20 ఇంధనం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై అరవింద్ కేజరివాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా ఇథనాల్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామి అని, డొనాల్డ్ ట్రంప్‌ను సంతోషపెట్టడానికి ప్రధాని మోదీ భారత్‌పై ఇథానాల్‌ను బలవంతంగా రుద్దుతున్నారని ఆయన ఆరోపించారు. E20 అమలులోకి రావడం వల్ల గత ఏడాదితో పోలిస్తే భారత్ అమెరికా నుండి ఐదు రెట్లు ఎక్కువ ఇథనాల్‌ను దిగుమతి చేసుకుంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో కేజరివాల్ మూడు ప్రధాన డిమాండ్లను వినిపించారు. మొదటిది, ప్రతి పెట్రోల్ బంక్‌లో వినియోగదారులు తమకు కావలసిన E20 లేదా స్వచ్ఛమైన పెట్రోల్‌ను ఎంచుకునే అవకాశం ఉండాలి. రెండవది, ఇథనాల్ కలిపినందున E20 పెట్రోల్ ధర స్వచ్ఛమైన పెట్రోల్ కంటే తక్కువగా ఉండాలి. మూడవది, పెట్రోల్ ధరను లీటరుకు 84 రూపాయల కంటే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.