భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీని లక్ష్యంగా యువత చేసే విమర్శలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశం కోసం నిరంతరం శ్రమించే మోదీకి మద్దతుగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత కే. పవన్ కళ్యాణ్ శనివారం భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కొందరు యువత దూషించడం చూసి తాను తీవ్రంగా కలత చెందానని ఆయన అన్నారు. మోదీపై జరుగుతున్న అవమానకరమైన వ్యాఖ్యలు విన్నప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగాయని ఆయన ఎమోషనల్‌గా పేర్కొన్నారు.
జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలను ప్రస్తావిస్తూ, ప్రధాని మోదీ తన మూడు term లలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. దేశం ఎదుర్కొంటున్న బాహ్య శక్తులతో పాటు అంతర్గత శక్తులతో కూడా మోదీ పోరాడుతున్నారని, ఈ తరుణంలో ఆయనకు మనం ఇవ్వగలిగే ఏకైక మద్దతు ఆయన పక్కన నిలబడటమేనని ఆయన స్పష్టం చేశారు.